పెద్దమ్మ తల్లి ఆలయానికి
బీజేపీ నేతల లక్ష రూపాయల విరాళం
రిపోర్టర్: నరేందర్ పడిదం, తొర్రూరు డివిజన్
(నమస్తే న్యూస్,అక్టోబర్ 4, దంతాలపల్లి)
దంతాలపల్లి మండలంలోని బొడ్లాడ గ్రామంలో ముదిరాజ్ కులదైవం పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి బీజేపీ నేతలు ఉదారంగా విరాళాలు అందించారు.బీజేపీ నాయకుడు హుస్సేన్ నాయక్ రూ.50 వేల రూపాయలు, గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు శంకరబోయిన సురేందర్ రూ.50 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ రెండు విరాళాలను కలిపి మొత్తం రూ.1 లక్షను సురేందర్ శనివారం ఆలయ కమిటీకి అందజేశారు.ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ “పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నా వంతు సహాయం అందించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గ్రామ ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధికి ఈ ఆలయం తోడ్పడుతుందనీ, భవిష్యత్ గ్రామాభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించడానికి కృషిచేస్తామని” అన్నారు.ఈ కార్యక్రమంలో బొడ్లాడ గ్రామ ముదిరాజ్ కమిటీ పెద్దలు, సభ్యులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.