కోతుల సమస్యను పరిష్కరించండి
- కోతుల సమస్యను తీర్చిన వారికే మద్దతిద్దాం..!
- ఎన్నికల లోపు కార్యాచరణ చేపట్టాలి.
- గ్రామ యువకుడు వీరగాని ఉమేష్
(నమస్తే న్యూస్, దంతాలపల్లి,అక్టోబర్ 7): స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధం అవుతున్న ఆశావాహులు కోతుల సమస్యను పరిష్కరించాలని గ్రామ యువకుడు వీరగాని ఉమేష్ మంగళవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కుమ్మరికుంట్ల గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని,కోతుల వల్ల మన గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పంటలకు నష్టం, పిల్లల భద్రత, ఇంటి వద్ద గందరగోళం ఏర్పడుతుంది.ఈ నేపథ్యంలో రాబోయే సర్పంచ్,ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ సమస్యపై తగిన హామీ గ్రామస్థులకు ఇవ్వాలని,హామీని ఎన్నిక లోపు నెరవేర్చిన అభ్యర్థులకు గ్రామస్థులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.గ్రామ అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. అందరూ ఈ విషయాన్ని గమనించి, సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉన్న అభ్యర్థులను ఎన్నుకోవాలని,పార్టీలకు అతీతంగా అందరు గ్రామాభివృద్ధికి పాటుపడాలని కోరారు.

