బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
(నమస్తే న్యూస్ ,దంతాలపల్లి,అక్టోబర్ 7 ):దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస కార్యకర్తలు గ్రామ బిఆర్ఎస్ నాయకులు గుండగాని యాకయ్య,కుర్యావుల గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారిని సాదరంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గుమ్మడవెల్లి మహేందర్ గుమ్మడవెల్లి శ్రీకాంత్ గుమ్మడవెల్లి మహేష్ గుమ్మడవెల్లి శ్రీకాంత్ గుమ్మడపల్లి చరణ్ గుమ్మడవెల్లి మనోజ్,ప్రవీణ్, విజయ్ నవీన్ మనోజ్ సురేష్ తదితరులు ఉన్నారు.







