Type Here to Get Search Results !

చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన మత ఉన్మాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన మతోన్మాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.

>>సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ పై మనువాద శక్తుల దాడి అమానుష చర్య.
>>కెవిపిస్ , సిఐటియు ఎమ్మార్పీఎస్ ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో  నిరసన. 



(నమస్తే న్యూస్, అక్టోబర్ 07, నర్సింహులపేట)
భారత దేశ అత్యున్నత న్యాస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై మత ఉగ్రవాది రాకేష్ కిషోర్ అనే న్యాయవాది తన బూటు విసిరి దాడికి పాల్పటాన్ని కెవిపిఎస్, సిఐటియు ఎమ్మార్పీఎస్  తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు గునిగంటి  మోహన్ కెవిపిఎస్ జిల్లా నాయకులు మందుల యాకుబ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొమ్మిరి ఉపేందర్ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు సిర సతీష్ గార్లు మాట్లాడుతూ ఈ దాడి భారత రాజ్యాంగం పై జరిగిన దాడిగా చూడాలన్నారు. ఈ ఘటన దేశం యావత్తు ఉలికి పాటుకు గురిచేసిందన్నారు. ఇది యాదృచ్చికంగా జరిగింది కాదు.మనువాద  ఆర్ఎస్ఎస్ ముసుగులో పథకం ప్రకారం గవాయ్ ని హత్యచేయాలనే కుట్రతోనే చేసిన దాడిగా చూడాలన్నారు. సనాతన ధర్మం ముసుగులో దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులోనే సీజేఐపై భౌతిక దాడికి పాల్పడటం దేశ చరిత్రలోనే చీకటి రోజుగా అభివర్ణించారు.న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు రాజ్యాంగానికి లోబడి కాకుండా మతం,దేవుళ్ళు,సనాతన ధర్మానికి లోబడి ఉండాలని ఆర్ ఎస్ ఎస్, బీజేపీ లు విస్తృతంగా ప్రచారం చేయడం వల్లనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సే ను  పూజించాలని చెప్పే భావజాల వ్యాప్తి వలన మత ఉగ్రవాదులు పెరిగి దాడులకు  పూనుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాస్వామ్యవాదులు, లౌకిక శక్తులు ఈ దాడిని ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బానోతు సర్వన్ మందుల పరశురాములు ఎమ్మార్ పీఎస్ మండల అధ్యక్షులు  నవీన్  ఉపేందర్ బి ఆర్ ఎస్ ఎస్ సి సెల్ నాయకులు మారపంగు వీరన్న నరేష్ సురేష్ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.