పోలీసు కార్యాలయంలో
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
(నమస్తే న్యూస్, అక్టోబర్ 07, మహబూబాబాద్)
మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.మహబూబాబాద్ జిల్లా పోలీసు అధికారి సుధీర్ రాంనాధ్ కేకన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్‌బీ డీఎస్పీ గండ్రతి మోహన్, కేసముద్రం సీఐ సత్యనారాయణ, సీఐ శంకర్ నాయక్, ఆర్‌ఐలు భాస్కర్, సోములు, నాగేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధికారులు మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర, ఆయన చూపిన ఆత్మీయత, సమానత్వం, ధర్మమార్గం గురించి స్మరించారు.

