దంతాలపల్లిలో ఎన్నికల నామినేషన్ కౌంటర్ ఏర్పాటు.
రిపోర్టర్: నరేందర్ పడిదం
(నమస్తే న్యూస్, దంతాలపల్లి, అక్టోబర్ 8)
దంతాలపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎన్నికల నామినేషన్ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో విజయ తెలిపారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం మండల పరిధిలోని ప్రతి గ్రామంలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయబడ్డాయని, ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.అలాగే బూత్ లెవెల్ అధికారులు ఎన్నికల ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలపై, విధివిధానాలపై అవగాహన కల్పించినట్లు ఎంపీడీవో విజయ వివరించారు.


