#Breaking news#
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.
ఉలిక్కిపడిన ఆలేరు గ్రామం.
క్షణికావేశంతో జీవితాలను చీకటిమయం చేసుకుంటున్న ప్రబుద్ధులు
(మహబూబాబాద్ జిల్లా, అక్టోబర్ 3, నెల్లికుదురు)
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త చేతిలో భార్య మృత్యువాత పడింది.స్థానికుల సమాచారం మేరకు ఆలేరు గ్రామానికి చెందిన నరేష్ తరచూ భార్య స్వప్న(35)తో గొడవపడేవాడు. క్షణికావేశంలో నరేష్ గొడ్డలితో స్వప్న మెడపై వేటు వేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.అలర్ట్ అయిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు విక్రమ్ (14), పండు (10) ఉన్నారు. ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదచాయ నెలకొంది.
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.
జీవితాలను చీకటిమయం చేసుకుంటున్న ప్రబుద్ధులు.
తాత్కాలిక కోపం శాశ్వతమైన నష్టానికి దారితీస్తోంది.మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన మరోసారి క్షణికావేశం ఎంత పెద్ద అనర్థానికి కారణమవుతుందో చూపించింది. కుటుంబ కలహాలు, ఆత్మ నియంత్రణ లోపం కారణంగా తల్లిదండ్రులే పిల్లల భవిష్యత్తును చీకటిమయం చేస్తున్నారు.సామాజికవేత్తల అభిప్రాయం ప్రకారం ఇలాంటి సంఘటనలు తగ్గాలంటే కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే మార్గమని చెబుతున్నారు.

