#Election Breaking
కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీయండి:
ఎర్రబెల్లి దయాకర్ రావు
రిపోర్టర్ : నరేందర్ పడిదం,తొర్రూరు డివిజన్(నమస్తే న్యూస్,అక్టోబర్ 04, తొర్రూరు)
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రజలు నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో నిర్వహించిన ఎంపీటీసీ క్లస్టర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “మోసపూరిత ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చి 22 నెలలు అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రాబోయే ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులకు ఈ బాకీ కార్డులు చూపించి, ‘ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?’ అని ప్రశ్నించండి,”అని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

