జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా
మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
(నమస్తే న్యూస్, అక్టోబర్ 02, మహబూబాబాద్)
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి గారు జయంతి వేడుకలను ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహబూబాబాద్ టౌన్ డిఎస్పీ తిరుపతి రావు గాంధీ గారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.... జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని, గాంధీ గారు అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని, గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఐ శేఖర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

