మానుకోట న్యూస్ మహబూబాబాద్
నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల దుకాణాలు నిర్వహిస్తున్న జిల్లాలోని (9) షాపుల లైసెన్సులు రద్దు
జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల
జిల్లాలో యూరియా కొరతను అధిగమించేందుకు వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖల సంయుక్త తనిఖీలలో భాగంగా అన్ని మండలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల పంపిణీ అవుతున్న యూరియా నిల్వలను పకడ్బందీగా రైతులకు పంపిణీ చేయడానికి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుందనీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల అన్నారు,
జిల్లాలోని ప్రైవేటు డీలర్ల యొక్క ఎరువుల నిలువలు యూరియా అమ్మకాలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రైవేటు డీలర్ల ద్వారా వీరి నుండి వచ్చిన యూరియా నిలువలను కూడా వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ, సంబంధిత టాస్క్ ఫోర్స్, సిబ్బంది ద్వారా నిత్యం పర్యవేక్షిస్తూ రైతులకు యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు,
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మండలాల ఎరువుల దుకాణాలను టాస్క్ ఫోర్స్ టీములు ముమ్మురంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని,
ప్రభుత్వ ఎరువుల నియంత్రణ చట్టం 1985ను అతిక్రమించి ఎరువుల వ్యాపారం నిర్వహిస్తున్న జిల్లాలోని డోర్నకల్ 3, కురవి 2, మరిపెడ 1, చిన్న గూడూరు 1, నెల్లికుదురు 1, మహబూబాబాద్ 1, మొత్తం (9) ఎరువుల దుకాణదారుల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని,
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యాపారం నిర్వహిస్తున్న సలార్ తండా లోని ఒక షాప్ ఈశ్వరి ట్రేడర్స్ యజమానులకు షోకాజ్ మెమోలు ఇవ్వడం అయిందని వ్యవసాయ శాఖ అధికారిని ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యంగా ప్రైవేటు ఎరువుల డీలర్స్ వారికి వచ్చే యూరియా, ఇతర ఎరువుల నిల్వలను పకడ్బందీగా స్టాక్ రిజిస్టర్లలో ఈపాస్ మిషన్లలో, పొందుపరిచి బిల్లుల రూపంలో రైతులకు ప్రతి భస్త అందించాలని, ఆదేశిస్తూ నిబంధనలు పాటించని ప్రైవేటు డీలర్లను వారి లైసెన్సులను రద్దు చేస్తామని అలాగే వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు

