Type Here to Get Search Results !

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్ 

యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది

ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేయాలి

రైతులను ఇబ్బంది పెడితే లైసెన్సులు రద్దు చేసి చర్యలు తీసుకుంటాం

జిల్లా వ్యాప్తంగా ఎరువుల దుకాణాల తనిఖీ  స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన యంత్రాంగం

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్


డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. 

బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్ వెంకటేశ్వరఎరువులు దుకాణం, సాలార్ తండ ప్రాంతాలలోని ఫర్టిలైజర్ షాపులను, మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజి, కురవి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను, గోడౌన్ ల లోని ఎరువుల నిల్వలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా స్టాకు నమోదును అధికారులతో కలిసి పరిశీలించారు. ఎరువుల రైతులతో మాట్లాడారు. ఎరువుల గురించి ఆందోళన చెందరాదని సమృద్ధిగా నిలువలు ఉన్నట్లు తెలియజేశారు.  యూరియాను కొనుగోలు చేసేటప్పుడు రైతులు  భూమి వివరాలు ఆధార్ కార్డును పరిశీలించి ఇవ్వవలసిందిగా వ్యాపారస్తులకు సూచించారు. ఆన్లైన్ విధానం ఓపి ఎంఎస్ ద్వారా మాత్రమే యూరియాను పంపిణీ చేయాలన్నారు. 

అనవసరంగా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే, అధిక ధరలకు విక్రయించిన, అక్రమ నిలువలు చేసిన, శాఖపరమైన చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందని, వారు హెచ్చరించారు. 

రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నుండి జిల్లాకు కావలసిన డిమాండ్ మేరకు యూరియాను తెప్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు.

మరిపెడ మండలం తానంచర్ల, దంతాలపల్లి మండల కేంద్రంలోని అయ్యప్ప టెండరస్ ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన (రెవెన్యు) అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ షాపులోని స్టాక్ నిల్వలను, తీసుకున్న వారి రశీదు లను తనిఖీ చేశారు.

 ఈ తనిఖీలో  వ్యవసాయ శాఖ అధికారులు, విజయనిర్మల, శ్రీనివాస్, సంబందిత మండలాల తహసిల్దార్ లు, రాజేశ్వరరావు, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.