నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలో రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రైతులతో కలిసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు
ఈ సందర్భంగా గునిగంంటి మోహన్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి వరినాట్లు వేస్తే నెల రోజుల కానుండి యూరియా అరకొరగా పంపిణీ చేస్తున్నారని, రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు ఎక్కువ ధరకు యూరియా ను ఇవ్వడం తో పాటు పురుగు మందులను అంటగట్టడం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయడం లో నిరక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు..
రాష్ట్రప్రభుత్వం, జిల్లా కలెక్టర్ స్పందించి రైతులకు సరిపడ యూరియా ను సరఫరా చేయాలని లేనట్టైతే యూరియా కోసం రైతుల తో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహయక కార్యదర్శి మందుల యాకూబ్, పోలపాక, వెంకన్న రైతులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు


