నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, 375వ జయంతి వేడుకలు అధికారికంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో , అదనపు కలెక్టర్ రెవెన్యు కె.అనిల్ కుమార్ తో హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
అనంతరం మాట్లాడుతూ..
సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడని సామాన్య కుటుంబంలో పుట్టి, అతి గొప్ప స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి అని ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు శక్తి అని నిరూపించారని అన్నారు. నిజాం పాలన పై తిరుగుబాటు చేసి వారి ఆగడాల కు అడ్డుకట్ట వేసేందుకు యుద్ధం చేసి గుణపాఠం చెప్పారన్నారు. ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం అన్నారు.
ఆయన పోరాటం భావి తరాలకు స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు. అందుకే సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి లను ప్రభుత్వమే నిర్వహిస్తున్నదన్నారు.
గౌడ కులస్తులు వృత్తిని ప్రేమిస్తూ...పిల్లలను బాగా చదివించుకోవాలని, మీరు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బాగుపడితేనే రాష్ట్రం దేశం బాగుపడుతుందని గౌడలకు అభినందనలు! శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బి.సి.సంక్షేమ అధికారి నరసింహాస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు గౌడ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



