నమస్తే మానుకోట న్యూస్
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జయపురం గ్రామ విద్యార్థులు ఆర్ శృతి, బీ సుజాత, సి హెచ్ సంఘవి, ఎన్ లాస్యా, ఎం వైష్ణవి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు.
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన వాలీబాల్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలలో వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
ఈ నెల 18-19 తేదీలలో రంగారెడ్డి జిల్లాలో జరిగే వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలలో వీరు పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను, వీరికి శిక్షణ ఇచ్చిన వీరారెడ్డి సార్ ని గ్రామస్తులు అభినందనలు తెలిపారు

