నమస్తే మానుకోట న్యూస్
దేశం ముక్కలైన ఈరోజు భారతావనికి దుర్దినం
దేశంకోసం ప్రాణాలర్పించిన వీరులకు క్రొవ్వొత్తులతో నివాళులు
నిజమైన ఘనమైన మన వారసత్వ చరిత్రను యువత తెలుసుకోవాలి
శంతన్ రామరాజు
రాష్ట్ర కార్యదర్శి
జాతీయ బిసి సంక్షేమ సంఘం
నిజమైన ఘనమైన మన వారసత్వ చరిత్రను తెలుసుకోవాల్సిన భాద్యత నేటి యువతపై ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రకార్యదర్శి శంతన్ రామరాజు పిలుపునిచ్చారు. 1947లో ఇదేరోజున దేశం ముక్కలైన విషాద ఘట్టాన్ని స్మరించుకుంటూ నాడు అశువులుబాసిన వీరులకు క్రొవ్వొత్తులతో నివాళులర్పించారు. స్థానిక అంబెడ్కర్ సెంటర్లో జరిగిన ఈకార్యక్రమంలో శంతన్ రామరాజు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోట్లాదిమంది భారతీయుల త్యాగాల పునాదులపై ఏర్పడిందని అన్నాడు. సస్యశ్యామలంగా విరాజిల్లుతున్న అవిభక్త భారతావని విదేశీ స్వదేశీ కుట్రదారుల చేతుల్లో ముక్కలైన ఈరోజు దేశ చరిత్రలో అత్యంత దుర్దినమని విచారం వ్యక్తంచేశాడు. దేశవిభజన సమయంలో జరిగిన మారణహోమం మానవజాతికే కలంకమని అభివర్ణించాడు. గతచరిత్ర చేదు అనుభవలనుండి భవిష్యత్తు పునాదులు వేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నాడు. కుల, మత, ప్రాంత, భాషలను కాకుండా దేశాన్ని ప్రేమించాలని, దేశమే మొదటి దైవమని సూచించాడు. ఇరుగుపొరుగు దేశాలతో సహా అమెరికా లాంటి సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ వ్యవస్థలనుండి మనకు ప్రమాదం పొంచివుందన్నాడు. ఓట్ల రాజకీయాలు మాని ప్రజలు ప్రభుత్వాలు దేశభవిష్యత్తుపై దృష్టి పెట్టాలన్నాడు. కోల్పోయిన మన అస్థిత్వాన్ని, కళా వైభవాన్ని తిరిగి సాధించాలన్నాడు. ప్రజలంతా ఐక్యతతో వర్గవిభేదాలు లేని ఆరోగ్య నవభారతాన్ని ఆవిష్కరించేందుకు కృషిచేయ్యాలన్నాడు.
నేర అవినీతి రహిత సమాజం కోసం ప్రతి భారతీయుడు పరితపించాలన్నాడు. మనకు స్వతంత్యం తెచ్చిన వీరులను సదాస్మరించుకోవలన్నాడు. మనల్ని కాపాడుతున్న రాజ్యాంగాన్ని, సైనికులను గౌరవించుకోవాలన్నాడు.
రేపు జరుపుకోబోయే 79వ.స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
ఇంకా ఈకార్యక్రమంలో రామరాజు ఉపేందర్ పటేల్, పిట్టల చంద్రశేఖర్, గండు కార్తీక్, గంగాదరి బాలరాజు, నల్ల ఆవేత్ కుమార్, కడుదుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

