నమస్తే మానుకోట న్యూస్ మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలో నకిలీమద్యం తయారి ముఠా అరెస్ట్...!!
సుమారు 4 లక్షల విలువ గల నకిలీ మద్యం స్వాధీనం..!!
వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కెకన్
మద్యం ప్రియులకు మరణశాసనం రాసేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం తయారీ ముఠా పురుడుపోసుకుంది.
మహబూబాబాద్ పట్టణంలోని ఇల్లందు రోడ్డు లో జ్యోతిబసునగర్ కాలనీలో ఇనాని రాజగోపాల్ అనే వ్యక్తికి చెందిన గోదాములో నకిలీ మద్యం తయారీకి తెరతీసింది. అత్యంత విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన మహబూబాబాద్ టౌన్, మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారీదారీల గుట్టురట్టు చేసారు. గోదామును తనిఖీ చేయగా అందులో కొంత మంది వ్యక్తులు స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు చేస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ.. నేరపూరిత సంఘటన వివరాలను మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన అల్లం రవీందర్ గతంలో మద్యప్రదేశ్ నుండి అక్రమంగా తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి వాటిని వరంగల్ ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఆ..క్రమంలోనే మహారాష్ట్ర రాష్ట్రం లోని నాగపూర్ కు చెందిన ఆశీష్ ఠాకూర్ తో పరిచయం ఏర్పడింది. అతను కూడా అల్లం రవీందర్ లాగా అక్రమంగా మద్యం అమ్మేవాడు.
ఈ క్రమంలో అల్లం రవీందర్ పై వరంగల్ ఖాజీపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కొద్దిరోజులు అల్లం రవీందర్ బ్యాంకులలో కస్టమర్లకు లోన్లు, క్రెడిట్ కార్డ్ లు ఇప్పించేవాడు. ఈ క్రమంలో ఖమ్మం కు చెందిన షేక్ సాబీర్ పాషా @ జానీ అను ఆర్ఎంపీ డాక్టర్ పరిచయం అయ్యాడు. అల్లం రవీందర్ చేస్తున్న పనితో డబ్బులు సరిపోకపోవడంతో, అక్రమమార్గంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చాడు. గతంలో పరిచయం ఉన్న నాగపూర్ కు చెందిన ఆశీష్ ఠాకూర్ తో కలిసి స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు చేసి, అమ్మి లాభపడాలని అల్లం రవీందర్, సాబీర్ పాషా @ జానీలు వ్యూహం పన్నారు. రవీందర్, షాబీర్ పాషాలు.., ఆశీష్ ఠాకూర్ తో మాట్లాడి అతనికి 1,50,000/- రూపాయలు ఇచ్చి నకిలీ మద్యం తయారీకి కావలసిన స్పిరిట్ ను అతని ద్వారా తప్పించినారు. ఇదే క్రమంలో వీరిరువురికీ వరంగల్ పెరికవాడకు చెందిన ములుగు రాజు @ మహేష్, రామ్ తేజ మరియు పెద్ద కిష్టాపురం గ్రామం, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓర్సు గోపాలకృష్ణ, రమేష్ అనువారు పరిచయం అయ్యారు. వారు కూడా వారివారి వ్యాపారాలలో నష్టం రావడంతో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించెందుకు, వీరు ఆరుగురు కలిసి ఆశీష్ రాకూర్ పంపిన స్పిరిట్ తో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే నకిలీ మద్యం తయారు చేసి అమ్మి లాభం పడేందుకు సిద్దమయ్యారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందురోడ్డు లో జ్యోతిబసునగర్ కాలనీలో ఇనాని రాజగోపాల్ అనునతని గోదామును ఎలక్ట్రికల్ స్టోర్ రూమ్ కోసమని అబద్దం చెప్పి నెలకు 27,000/- రూపాయలకు కిరాయికి తీసుకొన్నారు. ఆ..గోదాములోనే ఆశీష్ ఠాకూర్ పంపిన స్పిరిట్, రామ్ తేజ పంపిన 180 ml పరిమాణం గల ప్లాస్టిక్ బాటిల్లు, వాటి మూతలు, మరియు మద్యం రంగు లాగా ఉండడానికి స్పిరిట్ లో కలర్ కలిపి 2085 నకిలీ మద్యం బాటిల్లను తయారు చేసారు. వాటి పైన ఓల్డ్ అడ్మిరల్ స్పెషల్ విఎస్ఓపి బ్రాండీ కంపెనీకి చెందిన నకిలీ స్టిక్కర్లను అంటించారు. వాటిని అట్టపెట్టలలో పెట్టి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ చుట్టు పక్కల ప్రాంతాలకు తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేందుకు సిద్దం చేసారు. నిన్న ఓర్పు గోపాల కృష్ణ, జక్కుల రమేష్, సాబీర్ పాషా @ జానీలు రెండు కార్లలో వచ్చి వాటిని తీసుకుపోయేందుకు సిద్దంగా ఉండగా, మహబూబాబాద్ టౌన్, మరియు మహబూబాబాద్ ఎక్సైజ్ పోలీసులు వ్యూహాత్మకంగా దాడి చేసి పట్టుకున్నారు. ప్రస్తుతం వరంగల్ కు చెందిన రామ్ తేజ, మహారాష్ట్ర నాగపూర్ కు చెందిన ఆశిష్ ఠాకూర్ లు పరారీలో ఉన్నారు.
నిందితుల వివరములు
1) ఓర్సు గోపాల కృష్ణ H/O రాములు, వయస్సు: 38 సం.లు, కులం: వడ్డెర, వృత్తి: పంచాయితీ కార్యదర్శి @ తడికలపుడి గ్రామం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, R/ పెద్ద కిష్టాపురం గ్రామం, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా
2) షేక్ సాబీర్ పాషా @ జానీ వయస్సు: 39 సం.లు, కులం: ముస్లిం, వృత్తి ఆర్ఎంపిడాక్టర్, r/o గోపాలపురం, ఖమ్మం
3) జక్కుల రమేష్ S/o లింగమల్లు, వయస్సు: 35 సం,లు, కులం: యాదవ, వృత్తి డ్రైవరు, పెద్ద కిష్టాపురం, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా
4) అల్లం రవీందర్* s/o లక్ష్మయ్య, వయస్సు: 61 సం లు, కులం: గౌడ, వృత్తి: వ్యాపారం; Rd/d కాయంపేట, వరంగల్
5) ములుగు రాజు @ మహిప్ / టెలిపత్, వయస్సు: 39 సం.లు, కులం: మాదిగ, వృత్తి: హోటల్ వెయిటర్, పెరకవాడ, వరంగల్,
స్వాధీనం చేసుకున్న ప్రాపర్టీ వివరములు:
1. Tata Altroz Car bearing No.TS-26-D0405-. Engine No: REVTRNTOBXXM33420 and Chassis No: MAT632115NPCJ0720
2. Tata India Car bearing No. AP-20-AV-3155, Engine No: 475IDT14KWYP53607. and Chassis No: MAT608535DLK26530
3. Old Admiral special VSOP Brandy spurious liquor cartons-56 (Each Carton contains 48 180ml bottles). Total 53x48-2688 Bottles
4. Empty pet bottles 10x450-4500
5. Spirit 3x20 liters = 60 liters
6. Bottle Caps (one cover has 100 caps) 20 x 100-2000
7. Old Admiral special VSOP Brandy Label Stickers 39 Sheets @45 1755 labels
8. Empty Cartons 100
9. Plastic drums 2
10. Black Plastic tub
ఈ..విలేకరుల సమావేశంలో ఎస్పీసుధీర్ రాంనాథ్ కేకన్ తోపాటు ఎక్సైజ్ సూపరిండెంట్ కిరణ్ నాయక్, మహబూబాబాద్ టౌన్ సిఐ జి మహేందర్ రెడ్డి, ఎస్ఐలు టి. అశోక్, జె వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ లు ఎం రుద్రయ్య, బి. గౌతమ్, టి. శ్రీకాంత్, పి. సుమన్, ఎక్సైజ్ సిఐలు జి. చిరంజీవి, నాగేశ్వర్ రావు, హెచ్ సి ఎన్ మధు పాల్గొన్నారు. కేసు చేదించడంలో, అక్రమమద్యం తయారీ బాగోతానికి ఆదిలోనే అడ్డుకట్ట వేసిన వారందరికీ ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ నగదు బహుమతిని అందించారు.



