(నమస్తే మానుకోట న్యూస్ ,దంతాలపల్లి, ఆగస్టు 23): దంతాలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి రోగులకు పోషకాహార కిట్లను అధికారులు పంపిణీ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. రవి రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లా క్షయ నియంత్రణ అధికారి విజయకుమార్, వైద్యాధికారి డా. కవిత ఆధ్వర్యంలో దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లోని 22 మంది క్షయ రోగులకు ఈ కిట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల కేంద్ర స్పెషల్ ఆఫీసర్ ఉప్పుల సునీల్ కుమార్ రెడ్డి, ఎస్సై సురేష్ నాయక్, వెటర్నరీ డాక్టర్ సట్ల సౌమ్య, హెల్త్ సూపర్వైజర్ మంగమ్మ కూతురు డా. దివ్య స్ఫూర్తి, స్టాఫ్ నర్స్ స్వప్న రాణి, టీచర్ రాపర్తి అలివేలు, ఎన్జీవో ప్రతినిధి సుకన్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.పోషకాహార కిట్ల పంపిణీకి దాతలు బాధ కుమారస్వామి, పద్మ, ఇతరులు సహకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సిహెచ్ఓ సంజీవరావు, సూపర్వైజర్ సుజాత, భీమా నాయక్, టిబి నోడల్ సూపర్వైజర్ చలపతిరావు, ఏఎన్ఎంలు కవిత, కళావతి, కమల, సుమతి, ప్రసన్న కుమారి, ఆశావర్కర్లు, సిబ్బంది రెహమాన్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
క్షయ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ
August 23, 2025
0