(నమస్తే మానుకోట,మహబూబాబాద్, జూలై 22)
తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు ఓనర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా బస్సు యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు తాళ్ల అజయ్ గౌడ్, గాడిపెల్లి సతీష్, తీగల నవీన్ గౌడ్, సిరసాని వీరన్న, బూర్ల రమేష్ తదితరులు సభ్యులకు సభ్యత్వ పత్రాలు అందజేశారు. బస్సు యజమానుల ఐక్యతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యటనలు కొనసాగుతున్నాయని నేతలు తెలిపారు.అధ్యక్షులు K గోపాల్ రెడ్డి, I నరసింహారెడ్డి, K సోమయ్య, S వెంకటేష్, బాల్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ – “బస్సు యజమానులు తమ హక్కుల కోసం ఒకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అసోసియేషన్ ద్వారా వారికి పూర్తి మద్దతు అందిస్తున్నామని” స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగడంతో సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సంఘీభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

