రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి.
-ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న వ్వవసాయ పనిముట్లు తగిలి వాహన దారుడు మృతి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి ) ఆయిల్ ఫామ్ లో వినియోగించే పదునైన పనిముట్లతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి ,మరో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో పదునైన పనిముట్లు మెడకు తగిలి వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది.పెద్దముప్పారం గ్రామానికి చెందిన పెళ్లి దామోదర్ అను వ్యక్తి ,ఆయిల్ ఫామ్ తోటలో గెలలు కోయడానికి పనిముట్లు ద్విచక్ర వాహనంపై తీసుకెళుతుండగా, బానోత్ రమేష్(35) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండడంతో, ఆ కొడవలి మెడ భాగంలో బలంగా తాకడంతో తీవ్రంగా గాయాలతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుని స్వగ్రామం తుంగతుర్తి మండలం ఏనేకుంట తండాకు చెందిన వ్యక్తిగా తెలిపారు.కాగా మృతదేహంను పెళ్లి దామోదర్ ఇంటి ముందు వేసి ఆందోళనకు దిగారు.ఘటనాస్థలికి చేరుకున్న దంతాలపల్లి ఎస్పై పిల్లల రాజు ,తొర్రూర్ సిఐ పరిస్థితిని సమీక్షించారు.

