కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.
-న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్ నాయకుడు
కామ్రేడ్ బిక్షపతి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి) భారత కార్మిక సంఘాల సమాఖ్య"(IFTU) ఆధ్వర్యంలో దంతాలపల్లి మండలం బొడ్లాడా క్రాస్ రోడ్డ లో మేడే జెండాను ఎగరవేయ జరిగింది. ఈ సందర్భంగా తొర్రూరు డివిజన్ నాయకుడు కామ్రేడ్ బిక్షపతి మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం చికాగో అమరవీరులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వం 12 గంటలో విధానంగా అమలు పరచుటకు కుట్ర చేస్తున్నది. ఈ కుట్రలో భాగమే నాలుగు కార్మిక లేబర్ కోడులను తీసుకువస్తూ కార్మికుల హక్కులను హరించి చేయుటకు కుట్ర చేస్తున్నది. అలాగే ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను హత మార్చుతున్నది చత్తీస్గఢ్ అడవుల్లో అతి విలువైన 42 ఖనిజ, అటవీ సంపదను బిజెపి ప్రభుత్వం తన అనుకూలురైన బహుళ జాతి సంస్థలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ప్రతిఘటిస్తున్న ఆదివాసీలపై ఉక్కు పాదం మోపి రక్తపు టేర్లు పారించి వృద్ధులు మహిళలు పిల్లలు అనేది చూడకుండా చంపి వేస్తున్నది. ప్రశ్నించిన హక్కుల సంఘాల కార్యకర్తలను జైల్లో నిర్బంధిస్తున్నది. జైల్లోనే చనిపోయేటట్లుగా చేస్తున్నది. కార్మిక వ్యతిరేక బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో సమస్త శ్రామిక జనావళి పోరాడాలని ఈ సందర్భంగా బిక్షపతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలైన వెంకట్రాజం, నరసయ్య, బి క్కు నాయక్ ,కృష్ణమూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

