నిబంధనలకనుగుణంగా ఇందిరమ్మ
ఇళ్ళను నిర్మించుకోవాలి
:జిల్లా అడిషనల్ కలెక్టర్.
బీరీశెట్టి గూడెంలో జిల్లా అడిషనల్
కలెక్టర్ లెనిన్ వత్సవ్ పర్యటన.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి )
నిబందనలకనుగునంగ ఇందిరమ్మ గృహ నిర్మాణాలు చేపట్టాలని మహబూబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సవ్ టోప్పో అన్నారు. ఈ సందర్భంగా దంతాలపల్లి మండలం లోని బీరిశెట్టి గూడెం గ్రామంలో బుధవారం ఆకస్మికంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గృహ నిర్మాణం కట్టుకునే ఇళ్లను పరిశీలన చేశారు. గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్దిదారుల ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందించడం కోసమే అన్ని రకాలుగా ముందస్తుగానే పరిశీలన చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో కూడా అధికారులు సమగ్ర పరిశీలన చేసిన తర్వాతనే ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆయన తెలియజేశారు. ఎక్కడైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో పరిశీలించి లబ్దిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సలహాలు సూచనలు అందించాలని ఆయన తెలియజేశారు .నిజమైన లబ్దిదారులకు ఇల్లు అందేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వివేక్ రామ్ మండల వ్యవసాయ అధికారిని పి వాహిని ,పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.


