భూభారతి అవగాహన సదస్సును విజయవంతం
చేయాలి.
-తొర్రూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్: బట్టు నాయక్
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
భూభారతి అవగాహన సదస్సును విజయవంతం చేయాలని తొర్రూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్: బట్టు నాయక్ పిలుపునిచ్చారు.దంతాలపల్లి మండల కేంద్రంలో సాయి బాలాజీ గార్డెన్ లో మంగళవారం నిర్వహించే భూభారతి అవగాహన సదస్సు ను మండల ప్రజలు, స్వయం సహాయక సంఘ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వివిధ రకాల పథకాలలో భూభారతి పథకం ఒకటని ఇలాంటి పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టడం గొప్ప విశేషం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాకతో డోర్నకల్ నియోజకవర్గం మరింత అభివృద్ధికి సహకారం ఉంటుందన్నారు.బట్టు నాయక్, కొమినేని సతీష్, మాజీ ఎంపిటిసి నెమ్మది యాకన్న, పొన్నొటి బాలాజీ , గురుపాల్ రెడ్డి, హరికృష్ణ, సాదు లింగారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , పడిదం లింగమూర్తి,దైద వెంకన్న, మల్లం శ్రీను, మహేష్, వాసు, వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

