పడమటిగూడెంలో ఘనంగా బిఆరెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.
(నమస్తే మానుకోట-నర్సింహులపేట)
నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు చిమ్ముల వెంకట్ రెడ్డి ,ఆ పార్టీ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల యూత్ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం మాట్లాడుతూ పేదల బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ రావాలని,అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి బిఆరెస్ ప్రభుత్వం లో మాత్రమే జరిగిందని రాబోయే రోజుల్లో మళ్ళీ బిఆరెస్ ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు.నేడు హన్మకొండ జిల్లా లోని ఎల్కతుర్తి లో తలపెట్టిన రజతోత్సవ సభకు భారీగా బయలుదేరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిమ్ముల వెంకటరెడ్డి మరియు మండల బిఆర్ఎస్ నాయకులు పాతూరి రమేష్ రెడ్డి, మంచాల శ్రీశైలం, పాతూరి మధు రెడ్డి , మేకల వెంకన్న, కుంబాల లింగయ్య ,పిట్టల లింగయ్య, చిదిమెళ్ళ యుగేందర్ ,పాతూరి వెంకటరెడ్డి ,దారం వేదయ, అల్వాల యాకన్న, జక్కుల యాకన్న, పాతూరి అశోక్,నాయిని ఉప్పలయ్య, పాతూరి వెంకట్ రెడ్డి,వెన్ను వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


