Type Here to Get Search Results !

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య.

అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో 

దంతాలపల్లి మండలం తాహశీల్దార్ కి వినతి పత్రం..


-తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి 

అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని 

అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య.


-తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి 

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ 

ఊడుగుల ఐలేష్ యాదవ్.




(నమస్తే మానుకోట-దంతాలపల్లి)

స్థానిక మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో  తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని శివాలయం వైపు వెళ్లే దారిలో గ్రామ పంచాయతీ నుండి విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు అనుమతి తీసుకొని ఏప్రిల్ మూడవ తేదీన గ్రామ ప్రత్యేక అధికారి మండల తహసిల్దార్ చంద్ర రాజేశ్వర్, ఎంపీడీవో వివేక్ రాం, ఎస్సై పి.రాజు,మండల అధికారుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి, విగ్రహ ఏర్పాటుకు పనులు నిర్వహిస్తున్న  క్రమంలో కొంతమంది వ్యక్తులు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని చేస్తున్న ఆరోపనలపై తెలంగాణ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రజాకారులకు, విసునూరు దొరల ఆరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భూమికోసం, భుక్తి కోసం, తెలంగాణ రైతాంగ విముక్తి కోసం జరిగిన సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య అన్నారు. అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్థలాన్ని పరిశీలించి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునటకు సహకరించవలసిందిగా మండల తహశీల్దార్ సునీల్ రెడ్డికి అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో  విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ప్రధాన కార్యదర్శి& కాంగ్రెస్ పార్టీ యువజన జిల్లా కార్యదర్శి ఆవుల సురేష్ యాదవ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న యాదవ్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఉపాధ్యక్షులు మాజీ ఉపసర్పంచ్ బొల్లు వీరన్న యాదవ్, బహుజన సమాజ్  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి& మాల మహానాడు నాయకులు ఎడ్ల శ్రీనివాస్,కమిటీ సభ్యులు బెల్లి సంపత్ యాదవ్, మంగి సంపత్ యాదవ్, సందు ఐలయ్య యాదవ్, కొండ సాయి యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.