దంతాలపల్లి మండలంలో ఘనంగా శ్రీరామనవమి
(నమస్తే మానుకోట -దంతాలపల్లి )దంతలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి మండలం కేంద్రంతో పాటు బొడ్లాడ,పెద్దముప్పారం,రామవరం, రేపోని,దాట్ల, బీరిశెట్టిగూడెం గ్రామాల్లో శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆదివారం శ్రీ భక్తాంజనేయ స్వామి,రామాలయం ఆలయాల్లో వేడుకలను వైభవంగా నిర్వహించారు.రాములవారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు.ఆలయ ప్రాంగణాలు రామ నామ స్మరణతో మార్మోగాయి .రామవరం గ్రామంలో మార్త శ్రీనివాస్ ,మహేష్, నిమ్మల వెంకన్న, గౌని మధు ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణం వైభవంగా జరిపారు. ఇక్కడ ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిపి,అన్నదానం చేసి, ఆంజనేయ స్వామి గుడి చుట్టూ బండ్లు తిప్పడం అనవాయితిగా వస్తుంది.ఈ వేడుకల్లో సంటి దేవేందర్,ఇండ్ల కృష్ణ, దిడ్డి వెంకన్న, చాపల పట్టాభి,దిండి సందీప్ కోల మహేష్,కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు దైద వెంకన్న, పులుగుజ్జ అక్షరాములు, కొమ్మినేని వెంకన్న, దైద పూర్ణ చందర్, పగిడిపల్లి శ్రీను,గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.


