ఎస్సారెస్పీ నీటిలో తేలియాడిన మృతదేహం.... ఈతకు వెళ్ళి సుతారి మేస్త్రీ మృతి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఈతకు వెళ్ళి ఓ వ్యక్తి ఎస్సారెస్పీ కెనాల్ లో మునిగి పోయి మృత్యువాత పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా నర్సిపురం గ్రామంకు చెందిన మళ్లీ ఏడుకొండలు తండ్రి చెంచు కిష్టయ్య (25) అను సుతారి మేస్త్రి దంతాలపల్లి కి చెందిన శ్రీనివాసరాజ్ అనే మేస్త్రి వద్ద పని చేస్తూ దంతాలపల్లిలో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం భోజనం అనంతరం నాలుగు గంటల సమయంలో దంతాలపల్లి గ్రామ శివారులో గల సూర్యపేట రోడ్డుకు ఉన్నటువంటి ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఈత కోసమని వెళ్లి ఈత కొట్టే ప్రయత్నంలో నీట మునిగినాడు.మరుసటి రోజు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు.కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు,మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లుగా స్థానిక ఎస్సై పి.రాజు తెలిపారు.

