అంగరంగ వైభవంగా వల్మీడి రాములోరి కళ్యాణం.
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.
హాజరైన నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
మహా అన్నదానం చేసిన హనుమాండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు.
భారీగా తరలివచ్చిన భక్తులు.
(నమస్తే మానుకోట -పాలకుర్తి)
రాష్ట్ర ప్రజలు శుభిక్షంగా వుండాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా వాల్మీకి నడియాడిన నేల వల్మీడి(వాల్మీకి పురం) గుట్టపై కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు . స్వామి వారి కళ్యాణానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి హాజరు పట్టు వస్త్రాలు సమర్పించారు. మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వల్మీడికి భక్తులు పోటెత్తారు. దేవాలయ క్యూలైన్లలో వేలాది మంది భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. హనుమాండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు 10 వేల మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.... కళ్యాణానికి వచ్చిన భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. మరో భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన వల్మీడిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలంతా పాడి పంటలు బాగా పండి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.

.jpeg)


