అమ్మ ఒడి అనాథాశ్రమంలో భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామం అమ్మ ఒడి అనాధ శరణాలయంలో కిసాన్ పరివార్ యువ దళపతి నానావత్ భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మ ఒడి అనాధ శరణాలయం ఇంచార్జ్ సార్ మాట్లాడుతూ అనాధ ఆశ్రమాలలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.. కిసాన్ పరివార్ యువ దళపతికి ఎల్లప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయని అన్నారు.
భూపాల్ నాయక్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉపాధి కూలీలు.
దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమక్షంలో యువదళపతి కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలిచిన ప్రజా నాయకుడని,రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే ప్రజా సేవకుడు భూపాల్ నాయక్ అన్నారు.గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పక్షాన నిలబడి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.పల్లెల్లో పలకరింపు కార్యక్రమంలో ఆగపేట గ్రామ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి మా బాగోగులు తెలుసుకున్నారని అన్నారు.భవిష్యత్తులో కూడా కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు భూపాల్ నాయక్ కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.భూపాల్ నాయక్ వేడుకలను మా సమక్షంలో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.





