Type Here to Get Search Results !

తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర కేసీఆర్-మాజీ ఎంపీ మాలోత్ కవిత.

-ఏప్రిల్ 27న జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు విరాళం అందించిన వృద్ధురాలు.

-తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని  ముద్ర కేసీఆర్-మాజీ ఎంపీ మాలోత్ కవిత.



(నమస్తే మానుకోట-కురవి)

తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర కేసీఆర్ అని, కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని, బూటకపు మాటలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన పాలకులకు ,ప్రజలు తప్పకుండా  బుద్ధి చెప్తారని , కాంగ్రెస్ ప్రభుత్వం పై అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, కెసిఆర్ పాలనలోనే సంతోషంగా ఉన్నామని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎంపీ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్  కవిత అన్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల తులస్య తండాకు చెందిన బొడ బాజి తన పెన్షన్ డబ్బుల నుండి 1000 రూపాయలు  ఏప్రిల్ 27న జగనన్న బీఆర్ఎస్ రాజతోత్సవ సభకు  విరాళంగా అందించారు.ఈ నెల 27న వరంగల్ ఎలకతుర్తి లో  జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి డోర్నకల్  నియోజకవర్గ కురవి మండల పార్టీ  సమన్వయ  సమావేశంలో భాగంగా  సమావేశం అనంతరం మహబూబాబాద్ జిల్లా కురవి  తులస్య తండాకు చెందిన బొడ బాజి తన పెన్షన్ డబ్బుల నుండి 1000 రూపాయలు పార్టీకి విరాళంగా   భారాస జిల్లా అధ్యక్షులరాలు మహబూబాబాద్ మాజీ ఎంపీ కవిత మాలోత్ చేతికి అందజేసింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.