జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దంతాలపల్లి పదవ తరగతి ఫలితాల్లో ప్రభంజనం .
విద్యార్థులను...అభినందించిన ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ రెడ్డి.
హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాదించడం అభినందనీయమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ రెడ్డి అన్నారు. దంతాలపల్లి లో పదవ తరగతి వార్షిక పరీక్షలలో 118 మందికి గాను 117 మంది పరీక్షలకు హాజరు కాగా 115 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. 98.29%తో ఉత్తీర్ణత సాధించడం జరిగింది. స్కూల్ టాపర్స్ గా దీకొండ వర్షిత. 579, బానోతు జోత్స్న. 576, మనుపాటి తేజశ్రీ 567 మార్కులతో టాపర్స్ గా నిలిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పల్లా వేణు మాధవ రెడ్డి గారు , ఏ ఏ పీ సి చైర్ పర్సన్ శ్రీమతి లావణ్య సతీష్ మరియు ఉపాధ్యాయ బృందం టాపర్స్ గా నిలిచిన విద్యార్థులను అభినందించారు.

