ఆధునిక సాంకేతికతను రైతులకు అందించడమే ఆత్మ కమిటీ లక్ష్యం
-నల్లు సుధాకర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్
(నమస్తే మానుకోట-చిన్నగూడూరు)
ఆధునిక సాంకేతికతను రైతులకు అందించడమే లక్ష్యంగా 'ఆత్మ కమిటీ' పని చేస్తుందని మరిపెడ డివిజన్ కమిటి చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డిఅన్నారు.గుండంరాజు పెళ్లి గ్రామంలో సిపిఐ చిన గుడూరు మండల సమావేశం జరిగిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన నల్లు సుధాకర్ రెడ్డి ని చిన్న గూడూరు మాజీ జడ్పీటీసీ మూల మురళి రెడ్డి ,సిపిఐ మండల కార్యదర్శి గంజీ శేషాద్రి రెడ్డి కాంగ్రెస్, సిపిఐ నాయకులు ఘనoగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ గారు మిత్ర ధర్మాన్ని పాటించి, ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చిన పదవితో వారి గౌరవాన్ని కాపాడుతూ, రైతులకు మరింత సేవ చేస్తానని, వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి దొంతు స్టాలిన్, కందుల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు పట్ల కిరణ్ ,సంపత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, చిట్యాల వెంకన్న ఓగ్గుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.మేడే సందర్భంగా వాడవాడలు ఎర్రజెండాలు ఎగురవేయాలని సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.

