ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండ ను తక్షణమే నిలిపివేయాలి.
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
"అఖిలభారత రైతు కూలీ సంఘం"(AIKMS), "ఆల్ ఇండియా కేత్ మజ్దూర్ కిసాన్ సభ"(AIKMKS) ల ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో జరుగు సదస్సును జయప్రదం చేయండి.ఈ మేరకు ఈరోజు నరసింహులపేట మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు కామ్రేడ్ జాటోతుబిక్షపతి ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిక్షపతిమాట్లాడుతూ దేశంలో ముఖ్యంగా మధ్యభారతంలో ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను జరుపుతూ, నిత్యం నరమేధం సృష్టిస్తూ, రక్తాన్ని ఏరులై పారుస్తున్నది. అడవుల్లో ఉన్నటువంటి సహజ అటవీ, ఖనిజ సంపదను బిజెపి ప్రభుత్వం వారి తైనాతీలైన బడా కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం ప్రతిఘటిస్తున్న ఆదివాసులను హతమారుస్తున్నారు. నాడు బ్రిటిష్వాడు అటవీ సహజ సంపదను బంగారం వజ్రాలు వగైరా సంపదను కొల్లగొట్టుకొని పోతే ఈనాటి ఈ బీజేపీ ప్రభుత్వం వారి అభిమానులైన బడా కార్పొరేట్లకు ఈ సంపదను దోచిపెడుతున్నది. ఎదురుతిరిగిన అమాయక ఆదివాసి గిరిజనులను నిత్యం ఎన్కౌంటర్ల పేరుతో చంపి వేస్తూ, వారిని నక్సలైట్లుగా ముద్ర వేస్తూ, ప్రశ్నించిన వారిని కూడా జైలలో నింపుతూ బేస్ క్యాంపులలో కూడా బందీలుగా నిర్బంధిస్తూ, ఆపరేషన్ కగారి పేరుతో ఆదివాసి జాతి హనడానికి బిజెపికి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుపాల్పడుతున్నాయి. క్రూరమైన హత్యాకాండ కు తెగబడుతున్నాయి. ఆదివాసీలు జెల్, జంగల్, జమీన్కోకోసంఉద్యమిస్తున్నారు. వారు ఈ దేశ సంపదను అటవీ సహజ వనరులను కాపాడుతున్నారు.పరిశ్రమలు పర్యాటక కేంద్రాల పేరుతో అడవులను కొల్లగొడుతున్నారు. ఈ పాలకులు. కార్పొరేట్లతో మల్టీనేషన్ కంపెనీలతో కుమ్మక్కై ఆదానీ,అంబానీలతో చేతులుకలిపిదేశమూలవాసులైన గిరిజనులను నిత్యం చంపుతున్నది. మణిపూర్, అస్సాం, పంజాబ్, కాశ్మీర్ తదితర రాష్ట్రాలలో మత ముఠాలను రెచ్చగొట్టి అంతులేని అంతులేని క్రూరహింసాకాండ కొనసాగిస్తున్నదన్నారు. ఆదివాసీల పోరాటాల ఫలితంగా వన్ బై 70 చట్టం అటవీ హక్కుల చట్టం, పెస చట్టం, 2006 ఆదివాసుల గూడాలలో ఆదివాసులదే అధికారం అమలుకై రెండు వందల సంవత్సరాలుగా ఆదివాసులు ఉద్యమిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల తదిత రైతులపై నిర్బంధాన్ని మోపి రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారు. కార్మికుల ఐక్యతను చీల్చి వారి శ్రమను దోచుకునేందుకు 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా తెచ్చారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశ ప్రజలు యువకులు మేధావులు పోరాడుతుంటే ఉక్కు పాదంతో అణచివేసి, ప్రశ్నించే వారిని కూడా జైల్లో బట్టి నిర్బంధిస్తున్నారు అని అన్నారు.జల్, జంగల్, జమీన్ ఆదివాసులు దే.అడవులపై పూర్తి హక్కుల ఆదివాసులకు దక్కాలని అడవుల సహజ సంపదను బలా కార్పొరేట్లకు దోచిపెట్టడానికి వెనక్కి తీసుకోవాలని ఆదివాసీలపై జరుపుతున్న హత్యాకాండ దమన కాండపై సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి. పెస చట్టం 2006 ను నిష్పక్షపతంగా అమలు చేయాలి. ఆదివాసీల భూమి హక్కును ,జీవించే హక్కును, కాపాడాలని అన్నారు.ఈనెల 20వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని రైతు కూలీ సంఘం కోరుతున్నది. ఇంకా ఈ కార్యక్రమంలో సంతోష్ మణికుమార్ మిథున్ సంజీవ వెంకట్ రమణ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

