బండ్లు తిరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి-లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్
(నమస్తే మానుకోట -మరిపెడ)
ఈ నెల 26 న మాకుల భవసంగ్ మహారాజ్ & మ్యారామ యాడీ క్షేత్రం లో జరిగే బండ్లు తిరుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గోర్ సదస్సు ను ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సదస్సు కు ప్రతి తండా నుండి భవసంగ్ మహారాజ్ మ్యారామ యాడీ పేరు భక్తువులు,సాధువులు, సంతులు రావాలని ప్రతి తండా తండా తిరిగి లంబాడీల ఐక్య వేదిక తరుపున పోస్టర్ ను ఆవిష్కరించి పిలవడం జరుగుతుందని మరిపెడ మండలం మరిపెడ మున్సిపాలిటీ మంగ్తా సాధ్ గారి బుడియా బాపు క్షేత్రము లో లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ తెలిపారు.లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యి 26 తారీకున భవసంగ్ మహారాజ్ గారి బండ్లు తిరిగే రోజున జాతి సాధువులు చేత, జాతి భగత్ లు, జాతి సంత్ ల చేతుల మీదుగా సప్త భవాని మాతల మరియు 6 గురు జాతి గురువులు మరియు భవసంగ్ మహారాజ్, బుడియ బాపు , లింగా మసంద్ , లోక మసంద్ లా బోగ్ కార్యక్రమం జరుగుతుంది అలాగే జాతి మేధావులు, ఉద్యోగులు , కుల పెద్దలు, నాయకుల ఆధ్వర్యం లో మేధో మధన సదస్సు జరుగుతుంది అని తెలియ చేస్తూ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. జాతి సంస్కృతి పైన జరుగుతున్న దాడులు, జాతి దేవి దేవతల ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న కుట్రలు ఆపడం ఎలా అనే అంశం పై ఒక రోజు సదస్సు ఏర్పాటు చేసాము కావున అందరూ హాజరు అవ్వాలి అని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ గారు కోరారు. ఈ కార్యక్రమం లో మాకుల భవసంగ్ మహారాజ్ మ్యారామ యాడీ క్షేత్రం పూజారి సీతారాం నాయక్, సొమ్లా తండా బాలాజీ దేవాలయ పూజారి లాలు సాద్ , లంబాడీల ఐక్య వేదిక మరిపెడ మండల సమన్వయ కర్త గుగులోత్ దేవేందర్ నాయక్, రాజేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

