Type Here to Get Search Results !

అభిమాన నాయకునికి రక్తంతో గీసిన చిత్ర పటం బహూకరణ.

-అభిమాన నాయకునికి రక్తంతో  గీసిన చిత్ర పటం బహూకరణ.


-జిల్లా వ్యాప్తంగా అట్టాహాసంగా

కిసాన్ పరివార్ అధినేత 'ననావత్ భూపాల్ నాయక్' జన్మదిన వేడుకలు.


-'బాస్ ' కు అరుదైన బహుమతిని అందించిన కిసాన్ పరివార్ నర్సింహులపేట మండల కోఆర్డినేటర్ చెలిమిల్ల గణేష్.



కిసాన్ పరివార్ అధినేత భూపాల్ నాయక్ కు రక్తం తో గీసిన చిత్రపటాన్ని అందిస్తున్న నర్సింహులపేట మండల కోఆర్డినేటర్  గణేష్
.

(నమస్తే మానుకోట-మహబూబాబాద్)

సినిమా హీరోలకు,రాజకీయ నాయకులకు  రక్తాన్ని ధారపోసే అభిమానులు ఉన్నారని అప్పుడప్పుడు వింటుంటాం....కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసేవతో పాటు తనవెంట నడిచే ఉద్యోగులు, అనుచరులు, అభిమానులను ఇంటి మనుషుల్లా యోగక్షేమాలు చూసుకుంటారు కొందరు .ఇలా తమపై ప్రేమ ప్రదర్శించే సేవకుల కోసం ప్రాణాలిచ్చేందుకు, రక్తాన్ని దారపోసేందుకు కూడా అభిమానులు వెనకాడరు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సరికొత్త ప్రజా సేవకుడు కిసాన్ పరివార్ అధినేత,పారిశ్రామిక వేత్త,సామాజిక సేవకులు ననావత్ భూపాల్ నాయక్... ఈయన చేస్తున్న సేవలకు ఉమ్మడి వరంగల్ జిల్లా లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.నేడు భూపాల్ నాయక్ పుట్టిన రోజు వేడుకలను తమ అభిమానులు, కిసాన్ పరివార్ మండల కోఆర్డినేటర్ లు మహబూబాబాద్  జిల్లా  వ్యాప్తంగా అట్టహాసంగా జరిపారు.అయితే  ఎంతోమంది అభాగ్యుల,నిరుపేదల చీకటి జీవితాల్లో  వెలుగులు నింపి అపన్నహస్తాన్నందిస్తున్న   నాయకునికి   గిఫ్ట్  చాలా ప్రత్యేకంగా ఉండాలని కిసాన్ పరివార్ నర్సింహులపేట మండల కోఆర్డినేటర్ చెలిమిల్ల గణేష్  భావించాడు. కానీ ఎంతవెతికినా భూపాల్ నాయక్ పై  అభిమానం ఏస్థాయిలో వుందో తెలియజేసే గిప్ట్ అతడికి కనిపించలేదు.. దాంతో వినూత్నంగా  మనసుకు హత్తుకొనే విధంగా బహుమతి ఇవ్వాలని భావించాడు.అలా తన రక్తంతో అద్భుతమైన భూపాల్ నాయక్  ఫోటోను గీయించాడు. తన ప్రియమైన నాయకునికి ఆ ఫోటో ఫ్రెమ్ ను ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నాడు.ఆ ఫోటోను చూసిన భూపాల్ నాయక్  ఎమోషల్ అవుతూ తన వెంటనే ఆలింగనం చేసుకున్నాడు..జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన అతడిని అభినందించడంతో పాటు ధన్యవాదాలు తెలిపారు.తనపై ఈ ప్రాంత యువకులు పెట్టుకున్న నమ్మకానికి ,ప్రేమకు,అభిమానానికి వినమ్రుడిగా ఉంటానని ఇక్కడి ప్రజలకు కుటుంబ సభ్యునిగా ఉంటానని భూపాల్ నాయక్ అన్నారు.కాగా ఈ ఫ్రెమ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.