రైతులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు-ఉద్యానవన శాఖ అధికారి శాంతి ప్రియదర్శిని.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఈదురు గాలులకు పంట నష్టపోయిన రైతులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, పంట నష్టం జరగడం దురదృష్టకరమని ,దంతాలపల్లి మండలంలో సుమారు 50 ఎకరాల్లో మామిడి తోట నష్టం జరిగిందని, నష్టం పై అంచనాలను సర్వే నెంబర్ల వారిగా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని ఉద్యానవన శాఖ అధికారి శాంతి ప్రియదర్శిని అన్నారు.బుధవారం మండలంలోని రేపోణి, పెములపల్లి, రామానుజపురం, పెద్దముప్పారం, రామవరం గ్రా మాల్లో ఆమె పర్యటించారు. వారి వెంట వ్యవసాయ విస్తరణ అధికారి దీక్షిత్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.





