Type Here to Get Search Results !

బి.ఆర్.ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు-మాజీ మంత్రి డి.ఎస్.రెడ్యానాయక్.

వరంగల్‌లో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజితోత్సవ సభ.


సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి రెడ్యానాయక్.


చిన్నగూడూరు, మరిపెడ మండలాల నుండి పది వేల మంది హాజరు కావాలి.




(నమస్తే మానుకోట-మరిపెడ)

వరంగల్‌లో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజితోత్సవ సభకు ( BRS Silver Jubilee ) భారీగా తరలిరావాలని డోర్నకల్ మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్ మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు పిలుపునిచ్చారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో  చిన్నగూడురు, మరిపెడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్యానాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను పదిలక్షల మందితో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు మండలాల నుంచి 10 వేల మంది హాజరు కావాలని కోరారు. నాయకులు గ్రామాల్లో పర్యటించి సభ ప్రాముఖ్యతను కార్యకర్తలకు తెలియజేస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపాలని సూచించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చి నా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.మండలంలోని వీరారం రెవెన్యూ పరిధిలోని వెంకట్నాయక్ తండా, బోత్తల తండాకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్యానాయక్ సమీక్షలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, ఓడీసీఎం ఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు రామ డుగు అచ్యుత్ రావు, గుగులోత్ వెంకన్న, రాంసింగ్, తాళ్లపల్లి శ్రీనివాస్, గాదె అశోక్ రెడ్డి, మాణి క్యం, రాంబాబు, రవీందర్, చెన్నారెడ్డి, ఉప్పుల నాగేశ్వర్రావు, కోఅప్షన్ మాజీ మెంబర్ అయూబ్ పాషా, లతీఫ్, కాలూనాయక్, బాలాజీ, ఉపేందర్, పిట్టల ధనంజయ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.