గ్రామీణ పేదరిక నిర్మూలనే లక్ష్యం- ప్రగతి సేవా సమతి వ్యవస్థాపకలు గద్దల జాన్
-పెద్దముప్పారంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరానికి అపూర్వ స్పందన.
(నమస్తేమానుకోట-దంతాలపల్లి) సమాజం యొక్క సామాజిక ,ఆర్థిక నిర్మాణాన్ని పునర్నిర్మాణం మరియు ప్రత్యామ్నాయ జీవనశైలి, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే నైతిక సామాజిక చర్య ద్వారా వెనుకబడిన, సామాజిక తరగతులకు తొడ్పాటునందిస్తూ,గ్రామీణ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రగతి సేవా సమితి ముందుకు సాగుతోందని ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్ తెలిపారు.బుధవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అందత్వ నివారణ సంస్థ, ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రగతి సేవా సమితి వ్యవస్థాపకులు గద్దల జాన్, అతిదులుగా జడ్పీ హెచ్ ఇంచార్జీ హెడ్మాస్టర్ శంకరయ్యలు పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి క్యాంప్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా గద్దల జాన్ మాట్లాడుతూ ఫిబ్రవరి మొదలుకొని ఇప్పటివరకు 11 ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు నిర్వహించి సుమారు 550 మందికి ఆపరేషన్ లు చేయించామని తెలిపారు.
ప్రగతి సేవా సమితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతతోపాటు నెలకు నాలుగు ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాలు నిర్వహిస్తున్నామని , వీటితోపాటు కుటుంబాల సర్వే ద్వార వివిధ రకాల రోగులను గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కోసం వృత్తి నైపుణ్య శిక్షణనిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. శిబిరంలో 101మందిని పరీక్షించగా 50 మంది ఆపరేషన్ కు ఎంపిక జరిగిందని వారిని హైద్రాబాద్ శంకర కంటి ఆసుపత్రి కి ఆపరేషన్ కోసం పంపామని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రగతి సేవా సమితి ప్రోగ్రాం ఆఫీసర్ గద్దల రామ్మూర్తి,జిల్లా కో ఆర్డినేటర్ ఐనాల పరశురాములు, తొర్రూరు క్లస్టర్ కో ఆర్డినేటర్ చేడుపాక వెంకన్న,మరిపెడ మండల కో ఆర్డినేటర్ జినక సువార్త, శంకర కంటి ఆసుపత్రి ప్రోగ్రాం ఆఫీసర్ శివ రంగా, ప్రైమరీ పాఠశాల హెడ్మాస్టర్ కిషన్ నాయక్ ,ప్రగతి సేవా సమితి తానంచర్ల ఏరియా కో ఆర్డినేటర్ తప్పేట్ల సతీష్,అబ్బాయిపాలెం కో ఆర్డినేటర్ జినక కృష్ణమూర్తి , ఐకెపి సి ఎ మూరగుండ్ల వెంకన్న, వాలంటీర్లు ఈదుల సతీష్,ఎడ్ల శ్రీను,శంకర కంటి ఆసుపత్రి సిబ్బంది , పాఠశాల ఉపాధ్యాయ బృందం,వివిధ గ్రామాల నుండి కంటి రోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


