వేసవిలో ప్రజల దాహార్తి ని తీర్చడం అభినందనీయం.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
వేసవిలో ప్రజల దాహార్తి ని తీర్చడానికి కృషిచేయడం అభినందనీయమని ఏకశిలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాటిరాములు అన్నారు.దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామం జన వికాస ఆధ్వర్యంలో ఉడుగుల ఐలయ్య చలివేంద్రం ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి ఏకశిలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాటిరాములు హాజరై మాట్లాడుతూ ఎండాకాలంలో బాటసారుల కోసం జన వికాస ఆధ్వర్యంలో ఊడుగుల ఐలయ్య పెద్ద మనసుతో ఆలోచించి వారి అబ్బాయి ఊడుగుల సంతోష్ జ్ఞాపకార్ధంగా జల దానం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అన్ని దానాల కెల్లా మంచినీళ్ల దానం గొప్పదనీ ఎండా కాలంలో మంచినీళ్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ జల దానం ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలియజేశారు. రోడ్డు ప్రక్కల వాళ్ళు ఎవరిని నీళ్లు అడగాలన్న ఇబ్బంది పడకుండా ఇలాంటి జలదానాల కార్యక్రమాలు పెట్టడం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. ప్రజల అవసరాల మేరకు చాలా ఉపయోగపడుతుందనితెలిపారు. జన వికాస చేసే కార్యక్రమాలు అభినందించారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ మార్గం శోభారాణి చిలకమర్రి యాకలక్ష్మీ,విలేజి లీడర్లు ఊడుగుల గంగమ్మ,తుమ్మ నాగలక్ష్మి,బండి సునీత,సెగ్గం బిక్షమమ్మ,సభ్యులు లీడర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


