Type Here to Get Search Results !

కన్నీటి పర్యాంతమైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.

ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ కిషన్ నాయక్ భౌతికాయానికి నివాళులర్పించిన మాజీ మంత్రి  సత్యవతి రాథోడ్.



(నమస్తే మానుకోట-కురవి)

మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని కాకులబోడు తండా మాజీ సర్పంచ్ కిషన్ నాయక్  ఆత్మహత్య చేసుకోగా  మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో కిషన్ నాయక్  మృతదేహాన్ని చూసి మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కన్నీటి పర్యాంత మయ్యారు.కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కాకులబోడు తండా మాజీ సర్పంచ్ కిషన్ నాయక్  మరణించడం చాలా బాధాకరం, ఉత్సాహవంతుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఇంకా అభివృద్ధి చేయాలని తపన కలగిన నేత ఈరోజు మన మధ్య లేకపోవడం ఆ కుటుంబానికి మరియు మాకు తీరని లోటు, మొదటినుంచి నా తమ్ముడు లాగా కొడుకు ల నాతోపాటు ఉంటూ రాజకీయాల్లో ప్రయాణించే వ్యక్తి, మొన్ననే నా దగ్గరకు వచ్చి అక్క మన గ్రామానికి సంబంధించిన సీఎం ఆర్ యఫ్ చెక్కు వచ్చింది మీరు ఇప్పించారు అని,కాకుల బొడు గ్రామంలో ఎవరికి కష్టం వచ్చినా  నేను ముందుండి వారి కష్టసుఖాల్లో పాల్పంచుకుంటున్నాను అని నాతో చెప్పడం మేమిద్దరం కాసేపు మాట్లాడుకోవడం జరిగింది,  సర్పంచిగా  7:50 ఏడు లక్షల యాభై వేల అప్పుచేసి గ్రామ అభివృద్ధి పనులు చేసిన కిషన్ నాయక్, అంతేకాకుండా నేను ఐటిడిఏ రోడ్ మంజూరు చేస్తే  ఆ వర్క్ చేసుకొని దానికి సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉండడం వలన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతు తనకున్న వరి పొలం నీ అమ్మి అప్పులు తీరుస్తానని తన సహచరులతో  చెప్పారని తెలిసి భాద అనిపించింది, మరి ఇటీవల పదవి కాలం ముగిసిన సర్పంచ్ లు  ఇలా ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందడం మమ్మల్ని కలిసివేసింది, నేను ఇచ్చిన సిడిఎఫ్ నిధుల బిల్లులు ఇంకా విడుదల కాకపోవడంతో నేను మొన్ననే నా దగ్గరకు వచ్చిన అందరికీ చెప్పిన  కలెక్టర్ తో  మాట్లాడాను సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ తో కూడా మాట్లాడతానని చెప్పాను. నిధులు విడుదల అయ్యే విధంగా చూస్తానని వారికి చెప్పడం జరిగింది, ఎవరైతే మొదటిసారి సర్పంచ్ గా గెలిచి  గ్రామాలు అభివృద్ధి చేశారో  ఇంకా గ్రామాలను అభివృద్ధి చేయాలని తపన పడుతున్నారో, అలాంటివారి కి కాలయాపన చేయకుండా నిధులు మంజూరు చేసి వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.మరి ముఖ్యంగా ఎవరు కూడా ఇలాంటి ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోవద్దని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. కిషన్ నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు.కిషన్ నాయక్ కుటుంబాన్ని పార్టీ పరంగా నేను మరియు రెడ్యానాయక్  ఆదుకుంటామని హామీ ఇస్తూ, వారి కుటుంబానికి  ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.