శ్రీరాములవారి కల్యాణంలో పాల్గొన్న ప్రభుత్య విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్-ప్రమీల గార్ల దంపతులు
(నమస్తే మానుకోట-మరిపెడ )
కల్యాణ రాముడి ఆశీస్సులతో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రభుత్య విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రు నాయక్-ప్రమీల గార్ల దంపతులుఆకాంక్షించారు.మరిపెడ బంగ్లా పట్టణంలోని శ్రీ సీతారాముల స్వామి ఆలయంలో "శ్రీరామనవమి" పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది.కార్యక్రమంలో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే రామసహాయం సురేందర్ రెడ్డి గారితో కలిసి కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్-ప్రమీల దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణాన్ని వీక్షించి భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నూకల అభినవ్ రెడ్డి,మరిపెడ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్,పెద్దలు,ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.


