-కురవి మండల కేంద్రములో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించాలి.
-ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి జ్యోతి బసు,పట్ల మధు.
-ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ రామ చంద్రు నాయక్ కు వినతిపత్రం అందజేత.
(నమస్తే మానుకోట-కురవి)
కురవి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గందసిరి జ్యోతి బసు, పట్ల మధు డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ కు వినతిపత్రం అందజేశారు.. అనంతరం వారు మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గం లోని కురవి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు కొరవి మండలంలోని చాలా గ్రామాల విద్యార్థులు పై చదువుల నిమిత్తం ఖమ్మం కు వెళ్లవలసిన పరిస్థితి వచ్చింది అని తెలియజేశారు.. అలాగే కొరియర్ మండల కేంద్రంలో ఎస్సీ బాలికల వసతి గృహానికి సొంత భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుండ్ల రాకేష్ కొరవి మండల కార్యదర్శి కొలిపాక వీరేందర్ నాయకులు మనోజ్ మహేష్ వినోద్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

