దాతృత్వాన్ని చాటుకున్న దంతాలపల్లి సామాజిక విద్యా వేత్త...సేను రాజేష్
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
నిరుపేదల మరణించినపుడు వారికి ఉచితంగా సేవలందించడానికి ప్రీజర్ బాక్స్ అందించి దంతాలపల్లి యువకులు గొప్ప మనసు చాటుకున్నారు.మహబూబా జిల్లా దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన సామాజిక విద్యా వేత్త సేను రాజేష్ మరియు నెల్లూరి యాకన్న ఆధ్వర్యంలో సేను మహేశ్వరి జ్ఞాపకార్థం మరియు నెల్లూరి నారాయణ జ్ఞాపకార్థంగా "ఫ్రీజర్ బాక్స్"ను దంతాలపల్లి గ్రామ పంచాయతీ సిబ్బంది కి అందజేశారు, అనంతరం సేను రాజేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ద్రుష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు,అదే విధంగా త్వరలో సేను కీ"శే సేను మహేశ్వరి ట్రస్ట్ ని స్థాపించి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలకు,నెల్లూరి యాకన్న సహాకారంతో స్పూర్తిదాయకమైన కార్యక్రమాలకు శ్రీకారచుడుతామని తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దంతాలపల్లి ఎస్సై రాజుకు ధన్యవాదాలు తెలిపారు, అనంతరం దాతలకు గ్రామ ప్రజలు శాలువాతో సత్కరించారు,ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

