ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
-ఉద్యమకారుల మండల అధ్యక్షుడు మిడతపల్లి వెంకన్న డిమాండ్.
ప్లీనరీకి తరలి వెళ్ళిన ఉద్యమకారులు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల దంతాలపల్లి మండల అధ్యక్షుడు మిడతపల్లి వెంకన్న అన్నారు.సోమవారం మండల ఉద్యమకారులు ప్లీనరీకి తరలి వెళ్లారు .ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, 250 చదరపు గజాల ఇంటి స్థలం, రు.25000 పెన్షన్, కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఉద్యమకారుల మండల ఉపాధ్యక్షుడు మార్త శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కారుపోతుల రాములు గౌడ్,చిర్ర లింగయ్య, చిల్ల లక్ష్మణ్,కాగితోజు వెంకటేశ్వర్లు,ఎలగం శ్రీకాంత్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


