Type Here to Get Search Results !

రాజ్యాంగం విలువలు తెలిపేందుకే ప్రజల్లోకి--రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్

రాజ్యాంగ విలువలు తెలిపేందుకే ప్రజల్లోకి వస్తున్నాం.

-రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే  డా.రాంచంద్రునాయక్.


(నమస్తే మానుకోట-కురవి)

రాజ్యాంగం విలువలు తెలిపేందుకే ప్రజల్లోకి వెళ్లి జై బాఫు, జై భీమ్, జై సంవిధాన్, కార్యక్రమం చేపట్టామని,తద్వారా ప్రజలకు రాజ్యాంగ విలువలు తెలిపి వారిని చైతన్యవంతులు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచంద్రునాయక్ అన్నారు. ఈ సందర్భంగా కురవి మండలంలోని మోదుగుల గూడెం గ్రామంలో జై బాఫు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలు దిగజార్చే విధంగా వ్వవహరిస్తుందని ,రాజ్యాంగం విలువలు తెలిపేందుకే ప్రజల్లోకి వెళ్లి జై బాఫు, జై భీమ్, జై సంవిధాన్, కార్యక్రమం ద్వారా చైతన్యవంతులను చేస్తున్నామని అన్నారు. గత బిఆర్ఎస్ నాయకులు పదేళ్లు పాలించి ప్రజలను మభ్యపెట్టి బూటకపు మాటలతో పాలించి రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి. నేడు పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్న దేశంలో ఏకైక ప్రభుత్వం  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. గత పాలనలో సంక్షేమ పథకాల కోసం కాసులు తీసుకునేదని ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండవని ఎవరైనా సంక్షేమ పథకాల పేరుతో వసూళ్ల కు పాల్పడితే  తాట తీస్తా మన్నారు. ఇందిరమ్మ ఇండ్లు గాని రాజీవ్ యువ శక్తి లో కానీ ఎవరైనా పైసలు అడిగితే నాతోని చెప్పండి అని ఆయన అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో లంచాలకు తావు ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. సంవత్సరం పాలనలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీతో పాటు ,రైతు భరోసా యువతకు ఉద్యోగాలు, సబ్సిడీ విద్యుత్తు, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నియోజకవర్గ కో ఆర్డినేటర్ బండి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ గార్లపాటి వెంకట్ రెడ్డి. బాదావత్ రాము నాయక్. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రజనీకాంత్ , మండల ప్రధాన కార్యదర్శి ఆవిర మోహన్ రావు. సీనియర్ నాయకులు శ్యామల శ్రీనివాస్. బాలగాని శ్రీనివాస్. గ్రామ శాఖ అధ్యక్షుడు నారాయణ రాజేందర్. కోడి రాములు, బాదే వీరభద్రం, మండల యూత్ ఉపాధ్యక్షులు కోర్ని అనిల్. దయ్యాల శ్రీధర్. ఉపేందర్, వీరన్న. వేణు. అశోక్, బాబు. మల్లయ్య, వీరేందర్. మణి. మురళి. జంపన్న. వెంకటేశ్. విజయ్ కుమార్. నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.