(నమస్తే మానుకోట-కురవి)
జర్నలిస్టులు ప్రజాసమస్యలపై తన కలంతో రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రజలకు,ప్రభుత్వాలకు వారిదిగా ఉంటూ ప్రజల మన్నలను పొందాలని టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆకాంక్షించారు.మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని అంబెద్కర్ సెంటర్ లో సీనియర్ జర్నలిస్ట్, టియుడబ్ల్యూజే(ఐజేయు) దాడుల నియంత్రణకమిటీ జిల్లా కో-కన్వీనర్ బేతమళ్ళ సహదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాసమస్యలపై తన కలంతో రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రజలకు,ప్రభుత్వాలకు వారిదిగా ఉంటూ ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షించారు.సహదేవ్ జన్మదిన వేడుకలో కురవి మండల జర్నలిస్ట్ లు, టియుడబ్ల్యూజే(ఐజేయు) మండలబాధ్యులు, వివిధ రాజకీయపార్టీల, ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

