మారెమ్మ వద్దు 'మ్యారామ యాడీ' కావాలి.
(నమస్తే మానుకోట-మరిపెడ)
లంబాడీల ఐక్యవేదిక మరిపెడ మండలం ఇన్చార్జి గూగులోతు దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో లంబాడీల ఐక్య వేదిక మరిపెడ మండల కార్యాలయం లో శాంతి యుత నిరసన ర్యాలీ మరియు శాంతి యుత నిరసన ధర్నా యొక్క గోడ ప్రతి ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డోర్నకల్ నియోజకవర్గ లంబాడీల ఐక్య వేదిక ఇంచార్జ్ ప్రవీణ్ నాయక్ గారు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త జాదవ్ రమేష్ నాయక్ గారి సూచనల మేరకు ఏప్రిల్ నెల ఆరవ తారీకు న తలపెట్టిన శాంతియుత నిరసన ర్యాలీ మరియు శాంతియుత నిరసన ధర్నా కు లంబాడీ సంఘాల ప్రతినిధులు కచ్చితంగా ప్రతి ఒక్కరు హాజరవ్వాలని కోరడం జరిగింది.మన అందరికీ తెలిసిన విధంగా మాకుల భావసింగ్ బావ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి పేరు మీద పూజలు జరుగుతున్నాయి. దాని పక్కనే దండి మ్యారామ యాడీ పేరు మీద ఆదివాసి గిరిజన లంబాడీలు తమ యొక్క మొక్కలను యాట పోతుల రూపంలో కోళ్ల రూపంలో చెల్లించుకుంటా ఉంటారు.అతి పురాతనమైన దండి మ్యారామ యాడీ గుడిని పెద్దగా కట్టిన పిమ్మట అట్టి దేవాలయంలో జగజ్జనని దండి మ్యారామ యాడీ పేరు మీద లేదా జగజ్జనని మ్యారామ యాడీ లేదా జగజ్జనని జగదాంబ మాత పేరు మీద విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా ఆదివాసి గిరిజన లంబాడీలను కించపరిచే విధంగా సభ్య సమాజం ముందు లంబాడీలను అవమానించి మారెమ్మగా కొత్త విగ్రహాన్ని ప్రతిష్ట కు పూనుకున్న కారకులను వెంటనే విధుల నుండి తొలగించాలని ,అలాగే 40 లక్షల ఆదివాసి గిరిజన లంబాడీల మనోభావాలను కించపరిచిన సదరు వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అలాగే విగ్రహ ప్రతిష్ట కేవలం జగజ్జనని దండి మారాయా యాడీ పేరు మీద లేదా జగజ్జనని మ్యారామ యాడీ పేరు మీద లేదా జగజ్జనని జగదంబ మాత పేరు మీద విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం చేయాలని కోరడం జరిగినది .లేనియెడల అట్టి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమాన్ని అడ్డుకుంటాని లంబాడీల ఐక్య వేదిక ద్వారా హెచ్చరిస్తున్నామని తెలిపారు.దీనికి సంబంధించి జిల్లాలో ఉన్న లంబాడీ కుల సంఘాల నాయకులు అందరిని సంప్రదించడం జరిగిందని అన్ని కుల సంఘాల నాయకులు వస్తామని మాటివ్వడం జరిగిందని తెలియజేశారు.ఇప్పటివరకు మద్దతు తెలిపిన సంఘాలలో ముఖ్యంగా గోర్ సభ, లంబాడి హక్కుల పోరాట సమితి, లంబాడి హక్కుల పోరాట సంఘం అలాగే టెస్టా ఉద్యోగ సంఘం మరియు సేవాలాల్ సేన నాయకులు మద్దతు తెలిపారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల సెక్రెటరీ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

