బలవన్మరణానికి పాల్పడి వ్యక్తి మృతి.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.వేములపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల బాబు(34) అను వ్యక్తి తన ఇంటి వద్ద శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో చెట్టుకు చీరతో ఉరి వేసుకొని చనిపోయి ఉన్నట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల వివరాల ప్రకారం మృతుడు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ హాస్టల్లో భార్యా తో కలిసి పనిచేసుకుంటున్నారు.శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్న బాబు ఉరేసుకొని చనిపోయాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కాగా మృతుని తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు గా స్థానిక ఎస్సై పి.రాజు తెలిపారు.

