ఆదివాసి జాతిని హననం చేస్తున్న ఆపరేషన్ కగార్ ను ఆపాలి.
-సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూరు డివిజన్
కార్యదర్శి ఊడుగుల లింగన్న.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఆదివాసుల అననం రాజ్యాంగ విరుద్ధమని,కర్రె గుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఏకపక్ష దాడులను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు నిర్వహించాలని సిపిఐ(ఎం.ఎల్)న్యూడెమోక్రసీ ఇచ్చిన రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా దంతాలపల్లి మండలంలో ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమ కారుల ఐక్యవేదిక దంతాలపల్లి మండల అధ్యక్షులు,బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీను నిరసన తెలిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చత్తీస్ ఘడ్ - తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో గల కర్రెగుట్ట యుద్ధ క్షేత్రాన్ని మరిపిస్తుందని ఆయన అన్నారు. ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసి, గిరిజనులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారనీ ఆయన అన్నారు. వేలాది సాయుధ పోలీస్ బలగాలు అక్కడ తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.అడవి సంపద, ప్రకృతి ఖనిజ సంపద కార్పొరేట్ ఆధిపతులు అంబానీ ఆదానీలకు అప్పచెప్పే కుట్రలో భాగంగానే ఆదివాసి ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.కర్రెగుట్ట ప్రాంతం నుండి అన్ని రకాల సాయుధ పోలీస్ బలగాలని వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసి గిరిజనులని వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగార్ ను కేంద్ర, ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని .ఉడ్గుల లింగన్న.డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం-ఎల్) మావోయిస్టులు ఇటీవలి కాలంలో శాంతి చర్చలకు తాము సిద్దమని పదే పదే ప్రకటిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహారించడం సరికాదని, శాంతియుత వాతావరణ కోసం ప్రభుత్వం చొరవ చూపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఇరుగు నాగన్న, డివిజన్ నాయకులు జక్కుల యాకసాయిలు, కొమ్ము నరేష్ బి ఎస్ పి మండల అధ్యక్షులు,వల్లపు సాయిలు, నాగనబోయిన సంపత్, వెంకన్న, మందడి వెంకట్ రెడ్డి, అలువాల అన్వేష్ అంబేద్కర్ సంఘం మండల కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

