ప్రజాపాలనలో రైతు సంక్షేమమే ధ్యేయం
-ఏ.ఎమ్.సి వైస్ చైర్మన్ గుగులోత్ బట్టునాయక్.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని,ఇచ్చిన మాటకు కట్టుబడి ,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ,కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ గుగులోత్ భట్టు నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాము గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని దాట్ల ,రేపోని, గున్నేపల్లి, వేములపల్లి, రామానుజపురం, పెద్దముప్పరం, రామవరం, బొడ్లాడ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయంగా పాలనకొనసాగిస్తుందని అన్నారు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతికాలంలోనే అన్నివర్గాల అభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజా ఆదరణను పొందిందని,ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీతో పాటు రైతులు పండించిన ధాన్యానికి క్వింటాకు బోనస్ రూ:500 ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనను ఓర్వలేని కొంత మంది నాయకులు విష ప్రచారం చేస్తున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని విమర్శించారు. లింగారెడ్డి, గురుపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, నెమ్మది యాకన్న, సంపేట సురేష్ గౌడ్, మహేందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమేష్ రెడ్డి, మల్లం శ్రీను, తండ రాములు, హరికృష్ణ, దైద వెంకన్న, వంకట నారాయణ గౌడ్ పాల్గొన్నారు.

