పంటపొలంలోకి పందులు వస్తున్నాయని విద్యుత్ షాక్?
-మృతిచెందిన పందులను చూసి కన్నీటి పర్యాంతమైన ఎరుకలు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎరుకల సంఘాలు.
(నమస్తే మానుకోట-దంతాలపల్లి)
ఓ వ్యక్తి తన పొలంలోకి పందులు వస్తున్నాయనే నెపంతో విద్యుత్ షాక్ పెట్టి చంపారని పోలీసులకు పిర్యాదు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.బాధితురాలు మాదగాని యాకలక్ష్మి నిరుపేద ఎరుకల కులానికి చెంది జీవనోపాధిలో భాగంగా పందుల పెంపకాన్ని చెపట్టింంది.ఈ క్రమంలో పందులు ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపుకు వెళ్ళగా పక్కనే ఉన్న వ్యవసాయ పొలానికి చెందిన ఓ రైతు విద్యుత్ తీగలు పెట్టడంతో ఆ తీగలకు తగిలిన పందులు అక్కడికక్కడే మృతి చెందాయి.వాటి విలువ సుమారు రు.50 వేలు ఉంటుందని, చనిపోయిన పందులను సంబంధిత రైతు ఇంటి ముందు వేసి ఆర్థికంగా ఆదుకోవాలని బాధితురాలు విలపిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇరువు వర్గాలకు సర్ది చెప్పారు.కాగా ఈ ఘటనపై ఎరుకల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశ్య పూర్వకంగా చేసిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

